- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seethakka: మీడియాలో మహిళల రక్షణ కోసం నూతన పాలసీ.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women's Day) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాలో మహిళలపై ఉన్న వివక్షత పోవాలి
వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని, పాఠశాలల్లో గురువులు అదే విధంగా బోధించాలని సూచించారు. మహిళ పట్ల దురభి ప్రాయంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియాలో మహిళలపై ఉన్న వివక్షత పోవాలని, రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. మహిళా జర్నలిస్టుల వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీస్ స్ఫూర్తిదాయక స్టోరీస్ అందించాలన్నారు. మహిళల పట్ల విలువలతో కూడిన అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రతి ఉద్యమం వెనుక జర్నలిస్టుల పాత్ర ఉందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో మీడియాది కీలక పాత్ర అని తెలిపారు. మీడియాలో పని చేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలని అభిప్రాయపడ్డారు. మీ సలహాలు సూచనలకు అనుగుణంగా మీడియలో పనిచేసే మహిళల రక్షణ కోసం నూతన పాలసీని రూపొందిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేందుకు మా ప్రభుత్వం మీకు రక్షణగా నిలుస్తుంది.. అని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని, మీ ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






