కవితను విమర్శించిన మహిళా నాయకులు నష్టపోతారు.. జాగ్రత్త!: మంత్రి సీతక్క షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |

కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు.

కవితను విమర్శించిన మహిళా నాయకులు నష్టపోతారు.. జాగ్రత్త!: మంత్రి సీతక్క షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. బుధవారం మీడియా ప్రతినిధులతో సీతక్క చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అని విమర్శించారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా? అని ప్రశ్నించారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాడా అని అడిగారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం(KCR Family) అవినీతి బయట పడేసరికి కుటుంబ సభ్యులు గొడవపడి టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారని అన్నారు.

‘సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampally Srinivas Reddy) పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ములుగులో నన్ను ఓడగొట్టేందుకు వందల కోట్లు ఖర్చు చేశాడు. కవిత ఆరోపించిన బినామీ ఆస్తులపై బీఆర్ఎస్ ఎందు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? అని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడం కూడా పెద్ద డ్రామా అని చెప్పారు. మొదట కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రేపు మళ్లీ కేసీఆర్ కుటుంబం మొత్తం ఒక్కటవుతుందని.. అనవసరంగా కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడాలని కవితపై నోరు జారితే మీకే ఇబ్బంది అని హితవు పలికారు. కవితను విమర్శించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు కచ్చితంగా నష్టపోతారని అన్నారు.

Next Story