కాసేపట్లో ప్రజాప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు కాసేపట్లో హాజరు కాబోతున్నారు.

కాసేపట్లో ప్రజాప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు కాసేపట్లో హాజరు కాబోతున్నారు. 2021లో కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరు కాబోతున్నారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నాయకులతో కలిసి సీతక్క కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించాలని, ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో మరణించిన ప్రతి కుటుంబానికి వారు ఆసుపత్రుల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ (CMRF) నుంచి చెల్లించాలని కోరారు.

అయితే, లాక్‌డౌన్ ఉన్నా ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేసి కరోనాను మరింత వ్యాప్తి చేస్తున్నారని అప్పటి కేసీఆర్ సర్కార్ ఆమెతో పాటు అప్పటి ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌పై కేసు నమోదు చేసింది. కాగా, ఇదే కేసులో కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో సీతక్కపై 2021 ఫిబ్రవరి 5న నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.

Next Story