- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka : సమ్మక్క..సారలమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క
మినీ మేడారం జాతర(Mini Medaram Fair)రెండవ రోజు శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను(Sammakka Saralamma forest goddesses), చిరుమళ్ల సమ్మక్క సారలమ్మలను, బయ్యక్క పేట సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : మినీ మేడారం జాతర(Mini Medaram Fair)రెండవ రోజు శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను(Sammakka Saralamma forest goddesses), చిరుమళ్ల సమ్మక్క సారలమ్మలను, బయ్యక్క పేట సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆదివాసీ భక్తుల విశ్వాసానికి ప్రతిరూపమైన ఈ జాతర మహా జనసంద్రముగా మారిందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
మినీ మేడారం ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించిందని తెలిపారు. బయ్యక్కపేట, అయిలాపురం, కొండాయి, కన్నెపల్లి పిల్ల జాతరలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు సంతోషంగా అమ్మవార్లను సందర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. . గత ఏడాది మేడారం పెద్ద జాతర ఘనంగా జరుపుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం మినీమేడారం జాతర సహా పిల్ల జాతరలకు వచ్చే భక్తులు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్లు మాట్లాడుతు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.






