- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాదె ఇన్నయ్య 'మా ఇల్లు'ను సందర్శించిన మంత్రి సీతక్క
by Muthe.Rajitha |
ఇటీవల మావోయిస్టు భావజాలాన్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ NIA మాజీ నక్సలైట్, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మావోయిస్టు భావజాలాన్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ NIA మాజీ నక్సలైట్, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నయ్య నడుపుతున్న స్టేషన్ ఘనపూర్ లోని 'మా ఇల్లు' అనాథాశ్రమాన్ని నేడు పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. అక్కడి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయగా వారంతా మా డాడీని తీసుకురండి మేడం అంటూ భోరున ఏడ్చారు. దీంతో కొద్దిసేపు సీతక్క కిడా భావోద్వేగానికి గురయ్యారు. త్వరలోనే తప్పకుండా వస్తారని వారికి దైర్యం చెప్పారు. వారందరి చదువుకు, వసతికి తాను అన్ని ఏర్పాట్లు చేస్తానని సీతక్క హామీ ఇచ్చారు. అనంతరం సాగరం అనే గ్రామంలో మంచానికే పరిమితమైన ఇన్నయ్య తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు.
Next Story






