సమాజం సహకరించాలని మంత్రి సీతక్క పిలుపు

by Gantepaka Srikanth |

క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొవాలంటే ముందస్తు జాగ్రత్తలు, త్వరిత నిర్ధారణ, నాణ్యమైన వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఒమెగా క్యాన్సర్​ఫౌండేషన్​ప్రారంభించారు.

సమాజం సహకరించాలని మంత్రి సీతక్క పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కొవాలంటే ముందస్తు జాగ్రత్తలు, త్వరిత నిర్ధారణ, నాణ్యమైన వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఒమెగా క్యాన్సర్​ఫౌండేషన్​ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ కుటుంబం, ఉద్యోగం, సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని మహిళల ఆరోగ్యం, సంక్షేమం ప్రాధాన్యతగా ఉండాలని చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్​పీవీ వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమన్నారు. స్టాండ్ విత్ హర్” అనే సందేశాన్ని ప్రస్తావిస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునేలా కుటుంబాలు, సమాజం సహకరించాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన..

గ్రామాలు, పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపడుతున్న ఒమేగా క్యాన్సర్ ఫౌండేషన్‌ను అభినందించారు. ఫౌండేషన్ కార్యకలాపాలకు మద్దతుగా ఒమేగా హాస్పిటల్స్ ప్రత్యేక మౌలిక సదుపాయాలను ప్రకటించింది. బంజారాహిల్స్‌లో ఉన్న 230 పడకల సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిలో మొత్తం సామర్థ్యంలో 25 శాతానికి పైగా అయిన 60 పడకలను ఒమేగా క్యాన్సర్ ఫౌండేషన్‌కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం ఒమేగా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మొహన వంశీ మాట్లాడుతూ చికిత్సతో పాటు క్యాన్సర్‌పై అవగాహన పెంపు, ముందస్తు నిర్ధారణ, నివారణ వైద్యంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సేవలు అందని వర్గాలకు చేరుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవలు అందించిన మహిళలను ఆస్థ శక్తి అవార్డులు – డాటర్స్ ఆఫ్ ది సాయిల్ పేరుతో సత్కరించారు. కల్పన రమేష్ – జల శక్తి (పట్టణ జల సంరక్షణలో నాయకత్వం), డా. శివరంజని సంతోష్ – ఆరోగ్య శక్తి (ప్రజారోగ్య అవగాహన),,ఎన్‌ఎస్‌కే కుమారి – కరుణ శక్తి (జంతు సంరక్షణలో సేవలు),,శైలజ కిరణ్ – ధన శక్తి (పరిశ్రమల్లో నాయకత్వం, వ్యాపారోత్సాహం), రూపా మాగంటి – ఉద్యమ శక్తి (గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు),,లక్ష్మీ మంచు – కళా శక్తి (కళ, సినిమా ద్వారా సామాజిక సేవ), లలితా రాఘురాం – జీవన శక్తి (అవయవ దానం అవగాహన),,సునీత కృష్ణన్ – న్యాయ శక్తి (మానవ అక్రమ రవాణా నిరోధం) ప్రశంస పత్రాలు అందజేశారు.

Next Story