వారిని మీరు పట్టించుకోకండి.. చేరికలపై మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. కార్యకర్తలు అవేమీ పట్టించుకోవద్దని మంత్రి సీతక్క(Minister Seethakka) సూచించారు.

వారిని మీరు పట్టించుకోకండి.. చేరికలపై మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. కార్యకర్తలు అవేమీ పట్టించుకోవద్దని మంత్రి సీతక్క(Minister Seethakka) సూచించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. కులగణన చేపట్టి చరిత్ర సృష్టించాం.. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ బలోపేతం కోసం కృష్టి చేయాలని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Leaders) పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలన(Congress Govt)లో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని.. అలా అందేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇదే తరుణంలో ఎన్నికల వేళ పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు.. అలాంటి వారి గురించి కార్యకర్తలు పట్టించుకోవద్దని.. పార్టీ కోసం పనిచేసిన వారికే గుర్తింపు, పదవులు ఉంటాయని అన్నారు.

అంతకుముందు ఏఐసీసీ(AICC) మాజీ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ(Deepa Dasmunsi)కి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి.. భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీసుకున్న సంక్షేమం, అభివృద్ధి, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నేతలకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

Next Story