- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు.. ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశంలో మంత్రి సీతక్క
సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని (Minister Seethakka) మంత్రి సీతక్క సూచించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏపీ, తెలంగాణ పాస్టర్ల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక మంచి కాస్ కోసం పాస్టర్లంతా ఇక్కడ భేటీ కావడం అభినందనీయం అని కొనియాడారు. మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందని చెప్పారు. మతాలు, వేరైనా దేవుళ్ళు వేరైనా, ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ.. సాటి మనిషిని ప్రేమించాలని అన్నారు. ఫలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని తెలిపారు. మన దేశాన్ని లౌకిక రాజ్యాంగ మన పూర్వీకులు నిర్మించారని, ఇక్కడ అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంటుందన్నారు. ఎవరికి నచ్చిన దైవాన్ని.. వారు నచ్చినట్లుగా పూజించుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.
మతం వేరు కాదు మానవత్వం వేరు కాదని, మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలకు ఇష్టపడతారని అన్నారు. మత ప్రచారానికి పరిమితమవ్వకుండా మానవసేవయే మాధవసేవ అన్న సూత్రాన్ని అందరూ పాటించాలని సూచించారు. ప్రజల సౌఖ్యం కోసం, ఆరోగ్యం కోసం మతాలు పాటుపడాలని, దేవుని ప్రార్థనలు చేస్తూనే పేదల కోసం డాక్టర్ థామస్ పనిచేస్తున్నారని కొనియాడారు. వెయ్యి ఏండ్లు ప్రజలు గుర్తుంచుకునేలా సేవలు చేయాలని, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని మన ప్రత్యక్షంగా కలవలేకపోయినా.. వారి బోధనలు సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని గుర్తుకు చేశారు. పౌర సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, సమాజం కోసం మన ప్రాణాలు ఇవ్వలేకపోయినా.. తోటి ప్రజల కోసం సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ సమావేశం అయ్యారు. కమిషన్ యాక్టివిటీ, అవేర్నెస్ క్యాంపుల నిర్వహణ, బాధితులకు భరోసా తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.






