- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Seethakka: రాఖీ రోజు ఆర్టీసీతో మహిళలకు రూ.17 కోట్లు ఆదా: మంత్రి సీతక్క హర్షం
by Kema Shiva Kumar |
రాఖీ పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకోవడం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాఖీ పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకోవడం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రాఖీ రోజు మొత్తం 41.74 లక్షల మంది మహిళామణులు ఉచిత ప్రయాణం చేయగా, వారికి రూ. 17 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. ఇది రాఖీ రోజు రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్ర మహిళలకు ఇచ్చిన కానుకగా సీతక్క పేర్కొన్నారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్ధవంతగా అమలు చేస్తున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తున్నట్లు మంత్రి సీతక్క తె పలిపారు.
Next Story






