- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka : బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క సెటైర్లు
గత పదేళ్ళ బీఆర్ఎస్(BRS) పాలనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : గత పదేళ్ళ బీఆర్ఎస్(BRS) పాలనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) హాట్ కామెంట్స్ చేశారు. నేడు ములుగు జిల్లాలో జరిగిన పలు గ్రామసభ(GramaSabha)ల్లో పాల్గొన్న సీతక్క.. రాష్ట్రంలో 96 శాతం గ్రామాల్లో ప్రశాంతంగా సభలు జరిగాయన్నారు. పదేళ్ళ తర్వాత తొలిసారి గ్రామసభలు జరిగినందుకు ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. పథకాలకు అర్హులైన వారిని గ్రామసభల్లోనే గుర్తిస్తున్నామని, గతంలో మాత్రం ఎమ్మెల్యేలు ఫాంహౌసులో కూర్చొని పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేవారని ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఎవరి పేర్లు చెబితే వారికి మాత్రమే పథకాలు అందాయని, ప్రజాప్రభుత్వంలో నిజమైన లబ్దిదారులకు మాత్రమే అందిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని.. మిగతా గ్రామాల్లో నేడు జరుగుతున్నాయని తెలియజేశారు. అర్హులుగా ఉండి కూడా ఏవైనా పథకాలు అందకపోతే ఈ సభల్లో అధికారులకు, నాయకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు.






