- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి ప్రశ్నించారు.

- అభివృద్ధికి ఆటంకం కలుగకుండా చూడాలి
- ఆర్ ఓఎఫ్ఆర్చట్టం అడ్డు కాదు
- సచివాలయంలో ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లోని పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో : అటవీ చట్టాలు, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. అటవీ అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ ఓఎఫ్ఆర్చట్టం అడ్డు కాదని ఆమె గుర్తు చేశారు. శనివారం సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనులు, పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి ప్రశ్నించారు.
దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని చెప్పిన, నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ మంత్రి గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. మంత్రి ఆదేశాలతో కనీస రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని అటవీ అధికారులు పేర్కొన్నారు. అటవీ, అభయారణ్య చట్టాలు నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, కల్వర్టులు, లోకాజ్ వే నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని పీసీసీఎఫ్, అటవీ శాఖ అధికారులు, డీఎఫ్ఓలు హామీ ఇచ్చారు. తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అటవీ అభయారణ్య చట్టాలు అంగీకరించని పక్షంలో దృఢంగా పటిష్టంగా ఉండేలా గ్రావెల్, మట్టి రోడ్ల నిర్మాణాలను చేపడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ములుగు నియోజకవర్గ ఏజెన్సీలో పెండింగ్ పనుల జాబితాను అటవీ శాఖ అధికారులకు అందించి.. ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ విభాగంతో సమావేశం చేసుకొని పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈమావేశంలో పీసీసీఎఫ్ డాక్టర్ జి.సువర్ణ, ములుగు, మహబూబాబాద్ డిఎఫ్ ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






