Seethakka: గ్రామీణ రోడ్ల నాణ్యతపై రాజీ పడేది లేదు.. అధికారులపై సీతక్క సీరియస్!

by Ramesh Naini |

గ్రామీణ రహదారి పనుల పురోగతిపై బుధవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.

Seethakka: గ్రామీణ రోడ్ల నాణ్యతపై రాజీ పడేది లేదు.. అధికారులపై సీతక్క సీరియస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ రహదారి పనుల పురోగతి (rural road works)పై బుధవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క (Minister Seethakka) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్‌సీ కనక రత్నం హాజరయ్యారు. కొన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న వార్త కథనాలను మంత్రి సీతక్క ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. సీసీ రోడ్లు నాసిరకం పనుల పట్ల మంత్రి సీరియస్ అయ్యారని సమాచారం. నాసిరకం పనులు జరిగిన చోట బిల్లులు ఎలా చెల్లించారని, క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

క్వాలిటీ కంట్రోల్ టీములను తక్షణం ఆయా ప్రాంతాలకు పరిశీలనకు పంపాలని ఆదేశించినట్లు తెలిసింది. గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని, నాణ్యత లోపాలపై నివేదికలు తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏ స్థాయిలో ఉన్న వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నాసిరకం పనులు చేసిన చోట సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. దీంతో సీతక్క ఆదేశాలతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

Next Story