- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనుల పురోగతిపై మంత్రి సీతక్క బుధవారం సచివాలయంలో సమీక్షించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ జి సృజన, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి,

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనుల పురోగతిపై మంత్రి సీతక్క బుధవారం సచివాలయంలో సమీక్షించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ జి సృజన, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ కనక రత్నం, ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రౌండింగ్ అయిన పనుల్లో ఎంతమేర పనులు పూర్తయ్యాయి? ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులు, గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ, కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మత్తులు ఏ స్థాయిలో ఉన్నాయని మంత్రి సీతక్క అధికారులను ఆరా తీశారు. త్వరలో జిల్లాల్లో పర్యటించి జిల్లాల వారీగా పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. జిల్లాల వారీగా పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.
అనంతరం రాజేంద్రనగర్‌లో గల తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేదో మదన సదస్సు 2025 కు టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహిం, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సీతక్క హాజరైనారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆమె పరిశీలించారు. అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ కూడా పరిశీలించి మంత్రి వారిని అభినందించారు. చిన్నారులను ఆకర్షించే విధంగా మెటీరియల్ రూపొందించడం బాగుందన్నారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ ను రూపొందించి ప్రతి అంగన్వాడి కేంద్రానికి పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దత్తత స్టాల్ ను, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే విజయ మిల్క్ సెంటర్ ను కూడా మంత్రి సీతక్క సందర్శించారు.






