Seethakka: గోదావరి కరకట్ట నిర్మాణం వేగం పెంచండి

by Gantepaka Srikanth |

గోదావరి కరకట్ట నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క అధికారులను ఆదేశించారు.

Seethakka: గోదావరి కరకట్ట నిర్మాణం వేగం పెంచండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి కరకట్ట నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ములుగులోని ఇరిగేషన్ పెండింగ్ పనులపై, ఫ్లడ్ కెనాల్ వర్క్స్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్నవరం నుంచి రామప్ప కెనాల్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story