మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రి సీతక్క సమీక్ష

by Ajay Maddhiboyina |

మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సలహా, సూచనలతో మేడారంలో

మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రి సీతక్క సమీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సలహా, సూచనలతో మేడారంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆదివాసీల విశ్వాసాలు, స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ జీవిత గాథ‌ల‌ను ప్ర‌తిబింబించేలా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. మేడారం మాస్ట‌ర్ ప్లాన్‌లోని ప్రతి అభివృద్ధి కార్య‌క్ర‌మంలో ఆదివాసీల సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా ఉండాల‌ని చెప్పారు. పూజారుల ఆమోదం మేర‌కు స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెలు, ఎంట్ర‌న్స్, క్యూలైన్ల డిజైన్ ఉండాల‌ని సూచించారు. గిరిజ‌న సంక్షేమ సాంస్కృతిక శాఖ ప‌రిశోధ‌న గ్రంథాల ఆధారంగా డిజైన్ చేయాల‌న్నారు. వ‌చ్చే మేడారం జాత‌ర వ‌ర‌కు మేడారం మాస్ట‌ర్ ప్లాన్ లోని ఫ‌స్ట్ ఫేస్ పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్‌కు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Next Story