- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: మీకిదే లాస్ట్ చాన్స్.. మంత్రి సీతక్క సీరియస్
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని.. కుంటి సాకులు చెబితే కాంట్రాక్టర్లు రద్దు చేస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంగన్ వాడీ కేంద్రాలకు పది రోజులకు ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని అలా కాకుండా కుంటి సాకులు చెబితే కాంట్రాక్టర్లు రద్దు చేస్తామని మంత్రి సీతక్క (Seethakka) హెచ్చరించారు. అంగన్ వాడీ (Anganwadi Centers) చిన్నారులకు, లబ్ధిదారులకు పోషకాహారం కోసం గుడ్లను సరఫరా చేస్తున్నామని అలాంటప్పుడు సకాలంలో కోడిగుడ్ల సరఫరా చేయకపోతే ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించారు. ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‍లో అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పప్పు, మంచి నూనె, మిల్క్ సప్లయర్స్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారిగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు? సరఫరా లోపాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న సరఫరాదారులపై జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వంపై మంత్రి సీరియస్ అయ్యారు.
చిన్నారుల జీవితాలతో ఆడుకోవద్దు:
నాసిరకం గుడ్లు, నిర్దిష్ట సైజు కన్నా తక్కువ సైజు గుడ్లు సరఫరా చేసి చిన్న పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి హెచ్చరించారు. అంగన్‍వాడీ చిన్నారులు తెలంగాణ భవిష్యత్తు. సరుకుల సరఫరాలో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఇదే ఆఖరి వార్నింగ్ అని అన్నరు. భవిష్యత్తులో సరుకుల సరఫరా లోపాలు తలెత్తితే సంబంధిత కాంట్రాక్టర్‍ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. టెండర్ మార్గదర్శకాలు అంగీకరించిన తర్వాతే గుడ్ల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చాం. మొదటిసారిగా జిల్లాల వారీగా టెండర్లు ఇచ్చాం.అంగన్‍వాడీ పిల్లలకు చేసేది సేవ. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోణంలో చూడకూడదన్నారు. అంగన్‍వాడీలకు చిన్న గుడ్లు, నాసిరకం గుడ్లు సరఫరా చేయడం మహా పాపం అన్నారు. చిన్నారులు బలవంతంగా ఉండాలని కోడిగుడ్లు ధరలు సవరించి పేమెంట్ చేస్తున్నామని చెప్పారు. అందువల్ల టెండర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కోడిగుడ్లు సరఫరా చేయాలన్నారు. కోడిగుడ్ల నిల్వపై అంగన్‍వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.





