- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
seethakka: స్వలాభం కోసం ప్రోత్సహించే సిబ్బందిపై కఠిన చర్యలు.. సమీక్షలో మంత్రి సీతక్క హెచ్చరిక
ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని మంత్రి సీతక్క తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే వేసవిలో ఎక్కడా నీటి కొరత రాకుండా రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి సీతక్క (Seethakka) ఆదేశించారు. ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్యాలయంలో ఇవాళ మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష (Water Review Meeting) నిర్వహించారు. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమస్యలు వచ్చాక స్పందించడం కంటే, రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. స్వలాభం కోసం అనవసరంగా కొత్త బోర్లు వేయాలని ప్రోత్సహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మేడారం కోసం ప్రత్యేక అధికారులు:
మేడారం మహా జాతరలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 10వ తేదీన మేడారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మేడారం జాతర సందర్భంగా మిషన్ భగీరథ సిబ్బంది తరపున ఈఎన్సీ కృపాకర్ రెడ్డికి మంత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు.






