- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు ఎవరి మీద అనుమానం లేదు.. బాంబ్ బెదిరింపు కాల్‌పై మంత్రి సీతక్క రియాక్షన్
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. అక్కడ బాంబు ఉన్నట్లు ఓ అగంతకుడు నేరుగా కంట్రోల్ రూమ్‌కే ఫోన్ చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. అక్కడ బాంబు ఉన్నట్లు ఓ అగంతకుడు నేరుగా కంట్రోల్ రూమ్‌కే ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో కలిసి వెంటనే తనిఖీలు ప్రారంభించారు. చివరకు ఇది ఆకతాయిలు చేసిన పనిగా నిర్ధారించారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. రోజూ ప్రజాభవన్‌కు సమస్యలు చెప్పుకోవడానికి అనేకమంది వస్తుంటారు. అందరినీ లోపలికి అనుమతిస్తున్నాం. ఈ క్రమంలో బాంబు ఉందని అగంతకులు ఫోన్ చేసి అందరినీ భయబ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం ప్రజాభవన్ లోపక చెకింగ్ నడుస్తోంది. తమకు ఎవరి మీదా అనుమానం లేదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Next Story






