- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka: ‘నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. అక్కడ జరిగింది ఇదే’
మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా.. నన్ను కన్న సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెబుతున్నా.. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు.. ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగింది.. హరీష్ రావు చెప్పిన ఒక్క మాటలో కూడా నిజం లేదని సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. కేబినెట్ సమావేశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఖండించారు. హరీష్ రావు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కేబినెట్లో రాద్ధాంతం జరిగిందని చెబితే దానికి సాక్ష్యం చూపగలడా? జరగని విషయాలను జరిగాయని చెబుతూ ఆయన దిగజారిపోయారు.
ఇంత దిగజారి మాట్లాడడం ఆయనకి తగదు అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని సీతక్క ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులతో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు.. హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగానే అడ్వకేట్ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకారానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్ఎస్ అని సీతక్క మండిపడ్డారు. హరీష్ రావు ఇప్పుడు ఓ పత్రిక అబద్ధపు కథనాలను అమ్మే సేల్స్‌మెన్‌గా మారిపోయారని సీతక్క విమర్శించారు. క్యాబినెట్లో కొట్లాటలేదని స్పష్టంగా చెబుతున్నా. అబద్ధపు వార్తలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి అమ్ముడు కావడం లేదు.. బీఆర్ఎస్ లో ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోంది..ఆ కారణంగానే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని సీతక్క విమర్శించారు. మీ అవినీతికి సజీవ సాక్ష్యం కాలేశ్వరం ప్రాజెక్టే.. కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు.. అవాస్తవాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే త్వరలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు అని సీతక్క హెచ్చరించారు.






