- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్పొరేట్ ప్రీస్కూల్స్‌కు దీటుగా అంగన్వాడీలు.. మీ పిల్లలను చేర్పించండి: మంత్రి సీతక్క
కార్పొరేట్ ప్రీస్కూల్లకు దీటుగా అంగన్వాడీలు పనిచేస్తున్నాయని మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ (Preschool) ప్రీస్కూల్లకు దీటుగా (Anganwadi centers) అంగన్వాడీలు పనిచేస్తున్నాయని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ఐసీడీఎస్ నర్సాపూర్ పరిధిలోని అంగన్వాడి చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే కి ముఖ్యఅతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రీ ప్రైమరీ విద్యను పూర్తి చేసుకున్న అంగన్వాడి చిన్నారులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. చిన్నారుల చిరునవ్వులకు చిరునామాగా అంగన్వాడి కేంద్రాలు నిలుస్తున్నాయని చెప్పారు. చదువు, పోషకాహారంతో పాటు ఆరోగ్య సంరక్షణ.. అంగన్వాడీల ద్వారా అందిస్తున్నామని అన్నారు. అందుకే మీ పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు.
నేటి చిన్నారులే.. రేపటి పౌరులు అని, మన దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందన్నారు. అందుకే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బందిపై ఉందన్నారు. అంగన్వాడీల బలోపేతం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అంగన్వాడీ లబ్ధిదారులకు మరిన్ని పోషకాలను అందిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా (Anganwadi teachers) మినీ అంగన్వాడీ టీచర్లకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3989 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేసింది. ఇక నుంచి అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడి టీచర్లేనని, ఈ నెల నుంచి అమల్లోకి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650, గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం రూ.7800 ఉండేది. ఈ సందర్భంగా మినీ అంగన్వాడీ టీచర్లు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.






