‘కవిత చెప్పిన దయ్యం నువ్వేనా?’.. కేటీఆర్‌ను ప్రశ్నించిన సీతక్క

by Gantepaka Srikanth |

సిస్టర్ స్ట్రోక్‌తో.. కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అవాస్తవాల ప్రచారంలో కేటీఆర్​గోబెల్స్‌ను మించిపోయారని విమర్శించారు.

‘కవిత చెప్పిన దయ్యం నువ్వేనా?’.. కేటీఆర్‌ను ప్రశ్నించిన సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిస్టర్ స్ట్రోక్‌తో.. కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అవాస్తవాల ప్రచారంలో కేటీఆర్​గోబెల్స్‌ను మించిపోయారని విమర్శించారు. గ్లోబల్స్ అబద్దాలకు గ్లోబల్ అవార్డు కేటీఆర్‌కు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తుందన్నారు. కేటీఆర్​ప్రతిపక్ష పాత్రను మర్చిపోయారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్​మాట్లాడే స్థాయి లేదు అని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకో చెప్పాలని మంత్రి డిమాండ్​చేశారు. కాళేశ్వరం విషయంలో కమీషన్లు కపిపుచ్చుకోవడానికి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిరూపించా లేదో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదాకు కేటీఆర్ పనికిరారు అని, ఆయన ప్రజల కోసం ఎప్పుడూ పని చేయరు.. కానీ అబద్దాలను ప్రచారం చేయడంలో ముందుంటారని సీతక్క విమర్శించారు.

కేసీఆర్​చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పింది.. ఆమె చెప్పిన దయ్యం నువ్వేనా? కేటీఆర్ అని నిలదీశారు. రాహుల్ గాంధీని మాట్లాడి అర్హత కేటీఆర్‌కు లేదని, త్యాగాలపై రాజభోగాలనుభవించిన చరిత్ర కేసీఆర్​కుటుంబానిది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కుటుంబానికి దోచుకునీ, దాచుకునే చరిత్ర అన్నారు. భారత నీతిని ప్రదర్శించలేని మోడీని ట్రంపు నీతితో ముందుకు వెళ్తున్నాడరని విమర్శించారు. భారతదేశ ఔన్నత్యం కోసం దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై కక్షగట్టి ఈడిని ప్రయోగిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పత్రిక, స్వతంత్ర ఉద్యమ గొంతుక కోసం తన వంతు సహాయం చేశాడన్నారు. అధికార పదవిలో లేనప్పుడు ఇంకా ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగిందో ఈడి చెప్పాలన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరగలేదు, ఫెమా చట్టం ఉల్లంగించబడలేదు, ఆర్థిక అవకతవకలు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఈతరుణంలో ఈడీ ఎలా ఎంటర్ అవుతుందని, కేవలం రాజకీయ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు మోడీ అత్యుత్సాహంతో కేసు పెట్టారని పేర్కొన్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేయలేక మోడీ ఒత్తిడికి తలొగ్గారనే విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ దాన్ని తప్పుదారి పట్టించేందుకు ఈడీ కేసును తెరమీదకు తెచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తుంటే తట్టుకోలేక కేటీఆర్ అండ్ ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా నిరంతరం టార్గెట్ చేస్తుందన్నారు. గోబెల్స్ గురించి అబద్ధాల ప్రచారంతో కేటీఆర్ అండ్ సోషల్ మీడియా రెచ్చిపోతుందని చెప్పారు. అబద్దాలను నిజాలుగా చిత్రీకరించే మానసిక వ్యాధితో కేటీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. సిస్టర్ స్ట్రోక్ కాదు.. భవిష్యత్తులో కేటీఆర్ ఎన్నో రాజకీయ స్ట్రోక్లు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది నేషనల్ హెరాల్డ్ అని, ఆరోజు బ్రిటీష్ వాళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రికను నిషేధిస్తే.. ఇప్పుడు వారి దారిలోనే బీజేపీ నేషనల్ హెరాల్డ్ గొంతు ఎందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో వేలకోట్ల ప్రజల సొమ్మును బీజేపీ కూడగట్టుకుందన్నారు. గులాబీ కూలీల రూపంలో వందల కోట్లను బీఆర్ఎస్ వసూలు చేసిందని తెలిపారు. చేసింది కూలి.. అని దేశంలో అత్యధికంగా నిధులున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, అదేలా సాధ్యమైందో? బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క డిమాండ్​చేశారు.

Next Story