- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై మంత్రి సీతక్క
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma's Atmiya Bharosa)పథకం సన్నాహాలపై జిల్లా గ్రామీణ అభివృద్ధి(Rural Development)అధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma's Atmiya Bharosa)పథకం సన్నాహాలపై జిల్లా గ్రామీణ అభివృద్ధి(Rural Development)అధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం విధి విధానాలు...లబ్ధిదారుల ఎంపికపై సీతక్క దిశా నిర్దేశం చేశారు.
గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో పారదర్శకతతో వ్యవహరించాలని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. భూమిలేని రైతు కూలీలను, నిబంధనల మేరకు పనిదినాలు కల్గిన కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు ఎంపిక చేయాలని కోరారు. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.






