- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్‌పై సీతక్క ఫైర్.. తెలంగాణ ప్రజలకు కీలక పిలుపు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)పై కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క(Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం కుల గణన అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతం అని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని రాహుల్ గాంధీ కులగణన కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా బీసీ కులగలన కోసం పట్టుబడుతున్నారని గుర్తుచేశారు.
కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీ( Rahul Gandhi)ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ఆయన్ను ఎవరేం చేయలేదు. రాహుల్ విజన్ ఉన్న నాయకుడు. 30 సంవత్సరాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. విద్వేష, విధ్వంసమే బీజేపీ(BJP) విధానన్నారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని తెలిపారు. బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో..కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ( Rahul Gandhi) మతంపై చర్చ చేస్తున్నారు. పదేళ్లుగా దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ చేసింది ఏమీ లేదు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం బీజేపీ నేతల నైజం.. రాహుల్ గాంధీ పదవుల కోసం పాకులాడే మనిషి కాదు. త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమసమాజ లక్ష్యం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని సీతక్క(Minister Seethakka) అన్నారు.
అదానీ ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ( Rahul Gandhi) పనిచేయటం లేదు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యం. బీజేపీ విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు లోనవుతుంది. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే ఈరోజు దేశాన్ని నిలబెడుతున్నాయి. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ నిర్దేశ ప్రసంగాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ప్రజలంతా బీజేపీ నైజాన్ని గ్రహించాలని సీతక్క పిలుపునిచ్చారు.






