- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను తరిమేస్తున్నారు: మంత్రి సీతక్క
ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను తరిమేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో ఆదివాసీలను బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తరిమివేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఆదివాసీల అణచివేతలో భాగంగానే ఛత్తీస్ గఢ్ రాష్ట్రఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మాపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సెంట్రల్ జైలు లో ఇవాళ కవాసీ లఖ్మాను ట్రైకార్ చైర్మన్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, తదితర నేతలతో కలిసి ఇవాళ సీతక్క లఖ్మాను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఘీభావం తెలిపిన అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూడూ.. మాజీ మంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యే, ఆదివాసిల అగ్ర నేత కవాసీ లఖ్మాని అకారణంగా పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే లఖ్మాని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తందని మండిపడ్డారు. నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఏలాంటి సాక్షాదారాలులేకుండానే తప్పుడు కేసులతో ఆరు నెలలుగా జైలులో పెట్టారని మండిపడ్డారు. కవాసీ లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాటం కొనసాగుతోంది.






