- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో గద్దెలు మారుస్తున్నారని ప్రచారం.. రెచ్చిపోయిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఆదివారం బైక్‌పై తిరుగుతూ జాతర(Medaram Jathara) పనులు పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఆదివారం బైక్‌పై తిరుగుతూ జాతర(Medaram Jathara) పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కొందరు స్వార్థంతో ఇష్టారీతిన మేడారం జాతరపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మక, సారలమ్మల(Sammakka Saralamma) గద్దెలు మారుస్తున్నామని ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. గద్దెల అభివృద్ధికి ఇంకా DPR కూడా సిద్ధం కాలేదని సీతక్క స్పష్టం చేశారు. జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి హితవు పలికారు. కాగా, 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.






