- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలపై మంత్రి సీతక్క (Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపులను పక్కన పెట్టి అందర్నీ కలుపుకుపోవాలని సూచించారు. లోపులు ఉంటే సరిదిద్దుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ జనహిత పాదయాత్రలో (Janahita Padayatra) భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు. రాజకీయాల్లో ఓపిక ఉండాలని, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని మనకు నచ్చిన వారు నచ్చని వారు ఉంటారని అన్నారు. అందరిని గౌరవిస్తూ ఓపికగా వ్యవహరించాలని సూచించారు. ఎప్పుడూ ఘర్షనలకు దిగవద్దన్నారు. మనకు నచ్చని వ్యక్తులు కాదు సమాజానికి నచ్చేవారందరిని చేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రూప్ లీడర్లుగా ఉండవద్దని గుడ్ లీడర్లుగా ఉండాలన్నారు. అందరిని కలుపుకుని వెళ్తే మంచిదని లేదంటే మీకు నచ్చని వారు మిగతావారితో గ్రూప్ కడతారని హెచ్చరించారు.
ఎన్నికలు వస్తే బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. హిందువులు దేవుడికి పెట్టే అగర్ బత్తిపై జీఎస్టీకూడా బీజేపీ తగ్గించలేదని విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటోందని విమర్శించారు. బీసీలలో ముస్లింలలో కనిపింది మేము కాదన్నారు. బీజేపీ రిజర్వేషన్ల విధానానికే వ్యతిరేకం అని దుయ్యబట్టారు.






