- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళ్లు కడిగించుకునే దొరల సంస్కృతి మీది..బీఆర్ఎస్‌కు సీతక్క కౌంటర్
మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన కంటెస్టెంట్‌ల కాళ్లను మహిళలు కడగటంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: మిస్ వరల్డ్ అందాల పోటీలకు వచ్చిన కంటెస్టెంట్‌ల కాళ్లను మహిళలు కడగటంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మీరు ఎంతో మంది సినిమా యాక్టర్‌ల కోసం హైదరాబాద్‌ను ఏదోదో చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సబితమ్మా అబద్దాలకు అంబాసిడర్‌గా మారకు అంటూ హితవు పలికారు. తప్పుడు మాటలు మానేయాలని ప్రజలు ఎవరూ ఊరుకోరని మండిపడ్డారు.
మీలాంటి వాళ్లు, మీ నాయకుల లాంటి వాళ్లు తెలంగాణ ప్రజలను అనిచిపెట్టి కాళ్లు కడిగించుకున్న చరిత్ర, కాళ్లు మొక్కించుకున్న చరిత్ర మీదే అని మండిపడ్డారు. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగరవేసిందని అన్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయం, గిరిజన సంప్రదాయం ఆధారంగానే మర్యాదలు చేశామన్నారు. కాకతీయుల వారసత్వాన్ని, రుద్రమదేవి పౌరుశాన్ని కళారూపంలో ప్రదర్శించామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆత్మగౌరవం గుర్తుకు రాలేదని అధికారం పోయిన తరవాతనే బీఆర్ఎస్‌కు ఆత్మగౌరవం గుర్తుకువస్తుందని మండిపడ్డారు.






