Seethakka:బీఆర్ఎస్‌లో చేరలేదనే నాపై కక్ష.. కేసీఆర్, కేటీఆర్ పై సీతక్క సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-07-07 07:36:58  IST  )

కేసీఆర్, కేటీఆర్ పై సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

Seethakka:బీఆర్ఎస్‌లో చేరలేదనే నాపై కక్ష..  కేసీఆర్, కేటీఆర్ పై  సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తనను బీఆర్ఎస్‌లో చేరమని అడిగితే ఒప్పుకోలేదనే కేసీఆర్(KCR), కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క (Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆత్మగౌరవంతో ఉన్నానని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ములుగు (Mulugu) జిల్లాలో ఇవాళ ఓ చానల్‌తో మాట్లాడిన సీతక్క గిరిజన బిడ్డను కాబట్టే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వాళ్లు చేయని అభివృద్ధి పనులను తాము చేసి చూపిస్తున్నామని, దాంతో ప్రజలు బీఆర్ఎస్‌ను మరిచిపోతారనే భయంతోనే ఉనికి కోసమే ములుగులో కేటీఆర్ (KTR) డ్రామా ఆడిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ మొదటి నుంచి తనపై కక్ష కట్టారని, ఓడిస్తామని చాలెంజ్ చేసి చివరకు వాళ్లే ఓడిపోయారని పేర్కొన్నారు. కానీ తాను ఎవరి జోలికి పోనని, తన జోలికి వచ్చినోడెవడూ బాగుపడలేదని హెచ్చరించారు.

దమ్ముంటే నిరూపించాలి..

ఎన్నికలకు ముందు ప్రజలతోనే ఉన్నానని, ఇప్పుడు కూడా వారంలో మూడు రోజులు ములుగు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని సీతక్క చెప్పారు. కావాలనే బీఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మహత్య చేసుకునేలా ఆ పార్టీ నేతలు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు సబ్జెక్టు లేక సిగ్గులేకుండా చిన్నస్థాయి కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తూ కుట్ర రాజకీయాలకు తెర లేపిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో విషయంలో ఎవరికైనా అనర్హులకు వస్తే కలెక్టర్లకు ఫిర్యాదు చేసే విచారణ జరుపుతారన్నారు. అలా కాకుండా మొత్తాం లబ్ధిదారులపైనే ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పేదలకు మీరు ఇండ్లు ఇవ్వరు మమ్మల్ని ఇవ్వనివ్వరా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు సృష్టించడం కాదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ అరెస్టులు, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ అరెస్టులపై చర్చకు సిద్ధమా? అని అన్నారు. ఇవాళ ధర్నాలు చేస్తున్న వారు లెక్కలతో సహా రావాలని, ఊరికే డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అవసరం అయితే పరువు నష్టం దావా కూడా వేస్తానన్నారు.

Next Story