Seethakka: పేదలకు మేలు చేస్తే ఓర్వలేకపోతున్నారు: మంత్రి సీతక్క

by Prasad Jukanti |

బీఆర్ఎస్ తీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Seethakka: పేదలకు మేలు చేస్తే ఓర్వలేకపోతున్నారు: మంత్రి సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మంత్రి సీతక్క (Minister Seethakka) ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక పేదల కోసమే అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ (BRS) కళ్లలో నిప్పులు పోసుకుంటున్నదని ఇవాళ ములుగు జిల్లా వెంకటాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ అక్రమాలకు చెక్ పెట్టాలని భూ భారతి చట్టం (Bhubharati) తీసుకువచ్చామని అన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదలకు దగా చేసిందని అందుకే అర్హులకే భూమి చెందాలని కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో భూభారతి చట్టం తీసుకువచ్చిందని వెల్లడించారు. గూడులేని వారికి ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం వీఆర్వోలను వాడుకుని ఆ తర్వాత వారిని దొంగలుగా చిత్రీకరించారని మంచి లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Next Story