- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: ప్రెస్ క్లబ్‌కు రమ్మనడం ఏంటి? కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
రైతు సంక్షేమంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల8 వ తేదీన చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సవాల్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు సంక్షేమంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నెల8 వ తేదీన చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి సవాల్ చేశారు. ఈ (KTR) కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ (Challenge) కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉందని విమర్శించారు. విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కేటీఆర్ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడని, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి? అని ప్రశ్నించారు.
ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రెస్‌క్లబ్‌లో చర్చించడానికి కాదని చెప్పారు. 72 గంటల డెడ్‌లైన్ అంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అయిన డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నీ డెడ్ లైన్ కోసం ఇక్కడ ఎవరు ఎదురుచూడటం లేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి రాడా.. సమస్యల పై చర్చిద్దాం రా అంటే భయమెందుకు అని ధ్వజమెత్తారు. నీ సొంత చెల్లి.. నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు.. అని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఉన్న మీ నాన్నను అసెంబ్లీకి రమ్మను చర్చిస్తాం.. అని సీతక్క మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.






