- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్ సరిత రోల్‌మోడల్!
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సేవలందిస్తున్న సరిత మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తందని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం సచివాలయంలో

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సేవలందిస్తున్న సరిత మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తందని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం సచివాలయంలో ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా సేవలందిస్తున్న సరితను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇకపై సెర్ప్ ద్వారా మహిళలకు బస్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆసక్తిగల మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
సెర్ప్ ద్వారా మహిళలకు అందించే ఉచిత శిక్షణకు రోల్ మోడల్‌గా తొలి మహిళా డ్రైవర్ వాంకుడోత్ సరితానాయక్‌ని మంత్రి సీతక్క ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వంతో చర్చించి ఆర్టీసీలో మహిళా డ్రైవర్ల రిక్రూట్ చేసేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు ఉంటే మహిళా ప్రయాణికులు మరింత భద్రతగా, సంతోషంగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. సరిత ఆదర్శంగా మహిళలు డ్రైవింగ్‌తో పాటు అని రంగాల్లో రాణించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. అనంతరం ఎంఓడబ్ల్యూ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ కార్యచరణ పోస్టర్మంత్రి సీతక్క ఆవిష్కరించారు.






