- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను శక్తివంతం చేస్తేనే సమాజం బలపడుతోంది : మంత్రి సీతక్క
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. మహిళలకు అవకాశాలు ఇస్తే కుటుంబం ఎదుగుతుందని, మహిళలను శక్తివంతం చేస్తే సమాజం బలపడి దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. శనివారం సీతక్క ఒక ప్రకటనలో పేర్కొంటూ, మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమం, స్వయం ఉపాధి, సామాజిక భద్రత లక్ష్యంగా తమ ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం నుంచి కోట్ల రూపాయల బ్యాంకు రుణాల వరకు, స్వయం ఉపాధి నుంచి మహిళా వ్యాపార ప్రోత్సాహం వరకు, సంక్షేమం నుంచి స్వావలంబన వరకు అనేక పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నామన్నారు.
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేడ్కర్ చెప్పినట్లు ఒక సమాజం అభివృద్ధి స్థాయిని తెలుసుకోవాలంటే ఆ సమాజంలో మహిళల స్థితిని చూడాలని గుర్తుచేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అనేది ఉపకారం కాదని, అది సమాజం నిర్వహించాల్సిన బాధ్యత అన్నారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మహిళలు ఎదిగితే దేశం ఎదుగుతుంది అనే భావనతో ప్రతి ఒక్కరూ గివ్టూ గెయిన్ అనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.






