- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మంత్రి సీతక్క
మేడారం జాతరపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత కొంతకాలంగా క్లాస్ ప్రజలు కూడా జాతరకు వస్తున్నారని, ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది హైక్లాస్ ప్రజలు జాతరకు వచ్చారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మేడారం జాతరపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత కొంతకాలంగా క్లాస్ ప్రజలు కూడా జాతరకు వస్తున్నారని, ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది హైక్లాస్ ప్రజలు వచ్చారని చెప్పారు. దీనిని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అక్కడేముంది.. ఊరుదేవుళ్లే కదా అని వ్యాఖ్యానించిన పూజారులు, పీఠాధిపతులు జీర్ణించుకోలేకపోతున్నారని వారి వెనుక కొన్ని రాజకీయపార్టీలు ఉన్నాయన్నారు.
వాళ్లకు సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు మరియు యూట్యూబ్ ఛానళ్లు సైతం విష ప్రచారం చేస్తున్నాయన్నారు. జాతరకు ముందే ఓ స్వామి.. జాతరలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచారం చేశారన్నారు. జాతరకు పెరిగిన ఆదరణ చూసే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయినా కూడా జాతరకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారన్నారు. దేవుడిని మంచి మనసుతో నమ్ముకోవాలన్నారు. ఈ ఇంటి ఇలవేల్పుగా ఉన్న దేవతలు ఇప్పుడు ప్రపంచ దేవతలుగా మారారని అన్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు.






