- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు : మంత్రి సీతక్క
దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివస్ చేసేవారని, ఇప్పుడు 10 రోజులపాటు దీక్షా దివస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివస్ లో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా.. ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అలాగే పలు ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. వీటిని ప్రజలకు వివరించేందుకు 10 రోజులపాటు తాము కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వాటిని అడ్డుకునేందుకే దీక్షా దివస్ ను 10 రోజు చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ చేస్తున్న వాటిని ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వందల రెట్లు లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమేనన్నారు. బీఆర్ఎస్ వద్ద కేవలం అధికారం మాత్రమే లేదని, కోట్లాది రూపాయలు ఉన్నాయన్నారు. అధికారం ఉంటేనే ప్రజల్లోకి వస్తాం.. లేదంటే రాము అన్న చందంగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందన్నారు.
నాంపల్లి కోర్టుకు సీతక్క
కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో ఆమె ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేయగా.. విచారణలో భాగంగా నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు.






