టీచర్లు తమ సంస్కృతిని గిరిజన విద్యార్థులపై రుద్దొద్దు: మంత్రి సీత‌క్క

by Ajay Maddhiboyina |

ఆదివాసీ గిరిజన విద్యార్థులు ప్రత్యేకతను కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. టీచర్లు

టీచర్లు తమ సంస్కృతిని గిరిజన విద్యార్థులపై రుద్దొద్దు: మంత్రి సీత‌క్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీ గిరిజన విద్యార్థులు ప్రత్యేకతను కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. టీచర్లు తమ సంస్కృతిని గిరిజన విద్యార్థులపై రుద్దవద్దని సూచించారు. ఇక నుంచి టీచర్లకు ఏడాదికి రెండు సార్లు శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో, దసరా సంక్రాంతి మధ్యలో రెండు సార్లు ట్రైనింగ్ ఇస్తామని ఆమె చెప్పారు. బంజారాహిల్స్ లోని కొమురం భీం ఆదివాసి భవన్​లో ప్రభుత్వ గిరిజన సంస్థలలో టెన్త్, ఇంటర్, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య​అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె.తిరుపతి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, గిరిజన గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి విచ్చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో కీలకమైందన్నారు. ట్రైబల్ ఏరియాల్లో ఒకనాడు చదువు లేకపోవడంతో మనల్ని చిన్న చూపు చూశారని, ఇపుడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఇపుడు ప్రైవేట్ విద్యార్థులతో గిరిజన ఆదివాసి విద్యార్థులు పోటీ పడుతున్నారని చెప్పారు. ఎస్టీలు అధికంగా ఉన్న ములుగు, ఆసిఫాబాద్ మహబూబాబాద్ జిల్లాలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానాల్లో నిలిచాయన్నారు. విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యతం ఇస్తున్నారని అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత డైట్ ఛార్జీలు, పదహారేళ్ల తర్వాత కాస్మొటిక్ ఛార్జీలు పెంచారన్నారు. ఎస్టీ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకే గిరిజన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోందన్నారు. నిరక్షరాస్యత దశ నుంచి అక్షరాస్యత దశ దాటుకొని ఇప్పుడు రాష్ట్రానికి టాపర్స్ గా చేరకునే దశకు చేరుకున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహకం, గురుకుల విద్యాసంస్థల సిబ్బంది సహకారంతో గిరిజన విద్యా సంస్థలు మంచి ఉతీర్ణత సాధించాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆదివాసి గిరిజన సాంప్రదాయాలు నేర్చుకోవాలన్నారు. ట్రైబ్స్​నుంచి ఐఏఎస్ లో ఐపీఎస్ లు.. ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని అన్నారు. ఈ శాఖకు మంత్రి సీఎం, తాను ఈ శాఖకు డాటర్ అని మంత్రి వ్యాఖ్యనించారు.

బీఆర్ఎస్ పాలనలో​ఐటీడీఏలు నిర్వీర్యం..

బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం అయ్యాయని మంత్రి విమర్శించారు. ఐటీడీలను తిరిగి బలోపేతం చేయాలని సీఎం సూచించారని చెప్పారు. హాస్టల్స్ లో ఉన్న పుడు మన తల్లిదండ్రులు, తాతలు ఎం చేశారు అన్నది మరిచి పోవద్దన్నారు. ఏ కోర్సులకు డిమాండ్ ఉన్నాయో? వాటిని నేర్పాల్సిన అసవరసరం ఉందన్నారు. పది, ఇంటర్ తరువాత స్టూడెంట్స్ గైడెన్స్ దొరకట్లేదన్నారు.

నిత్య విద్యార్థినే..

‘మా ఇంట్లో నేను ఒక్కతే అమ్మాయిని.. వంద మంది అక్కాచెల్లెళ్లను హాస్టల్ నాకు ఇచ్చింది.. ఈ మీటింగ్ లో నాకు చదువు చెప్పిన ఇద్దరు టీచర్లు వచ్చారు.. వారి ప్రోత్బలంతోనే నేను ఈ స్థాయికి వచ్చా.. అని మంత్రి సీతక్క అన్నారు. తాను నిత్య విద్యార్థిగా ఉండడం ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. ఇపుడు రెండో పీహెచ్​డీ కోసం ఎంట్రన్స్ రాశానని చెప్పారు. కొత్తది నేర్చుకోవాలి.. నేర్చుకున్నది పది మందికి పంచాలి అన్నదే తన ఫిలాసఫీ అని పేర్కొన్నారు. చదువు నాకు బతుకు నిచ్చిందని, చదువు మూలంగానే నన్ను ప్రజలు గౌరవిస్తున్నారన్నారు. ఉన్నత స్థానాలకు చేరుకునే గిరిజన విద్యాసంస్థల విద్యార్థులు.. సమాజానికి తిరిగి సేవలందించాలని మంత్రి ఆకాక్షించారు. అనంతరం టెన్త్, ఇంటర్, ఎంసెట్ జేఈఈ మెయిన్స్ లో చక్కటి ప్రతిభ కనపరిచి స్టేట్ ర్యాంకర్స్ గా నిలిచిన గిరిజన గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించారు. గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఆదివాసి గిరిజన పెయింటింగ్స్ తో రూపొందించిన చీరను మంత్రి సీతక్క కు విద్యార్థులు బహుకరించారు. స్టేట్ ర్యాంకర్స్ తో కలిసి మంత్రి సీతక్క సహపంక్తి భోజనం చేశారు.

Next Story