Minister Seethakka: అనుకున్న సమయానికి గ్రూపు-1 పరీక్షలు జరిగి తీరుతాయి

by Gantepaka Srikanth |

అనుకున్న సమయానికి తెలంగాణలో గ్రూపు-1 పరీక్షలు(Telangana Group-1 Exam) జరిగి తీరుతాయని మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు.

Minister Seethakka: అనుకున్న సమయానికి గ్రూపు-1 పరీక్షలు జరిగి తీరుతాయి
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్న సమయానికి తెలంగాణలో గ్రూపు-1 పరీక్షలు(Telangana Group-1 Exam) జరిగి తీరుతాయని మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. ఆదివారం ఆమెమీ డియాతో మాట్లాడారు. అభ్యర్థులు విపక్షాల ట్రాప్‌లో పడొద్దు, జీవితాలను ఆగం చేసుకోవద్దని సీతక్క సూచించారు. నిరుద్యోగులను నిండా ముంచి పదేళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని టీజీపీఎస్సీ కమిషన్‌, ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినా వారికి అనుకూలంగా తీర్పు రాకపోవడంతో అధికారులు పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు గత వారం రోజులుగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు.

Next Story