- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించాలని కోరారు. మా ప్రచారానికి మంచి ప్రజా స్పందన వస్తుందని, ప్రజా స్పందన చూస్తుంటే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని జోస్యం చెప్పారు. నవీన్ యాదవ్ గెలుపు లాంచనమేనని, కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్చుకోలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అబద్దాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ కు ఓటమి తధ్యం అని అన్నారు. బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ పని చేస్తుందని ఆరోపించారు. ఇక, జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని, అందుకే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు.






