Seethakka: ఫీల్డ్ అసిస్టెంట్లకు మంత్రి సీతక్క హామీ.. ఈ నెల 30న..

by Prasad Jukanti |

ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి సీతక్కను కలిశారు.

Seethakka: ఫీల్డ్ అసిస్టెంట్లకు మంత్రి సీతక్క హామీ.. ఈ నెల 30న..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 30న అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క (Seethakka) హామీ ఇచ్చారు. ఇవాళ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న గౌడ్ నేతృత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సచివాలయంలో మంత్రి సీతక్కను కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యలు విన్న మంత్రి.. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల విషయంలో ఎల్లుండి అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత పదేళ్లుగా పలు అంశాల్లో అన్యాయం జరుగుతోందని తమకు న్యాయం చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు.

Next Story