- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ దొంగ వీడియోలు.. మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు
బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ వాళ్లు దొంగ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ వాళ్లు దొంగ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరోపించారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ వాళ్లు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం యూసుఫ్ గూడాలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల బాగు కోరే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అని, దొంగ వీడియోలను బీఆర్ఎస్ మాయ మాటలను మహిళలు నమ్మొద్దని సూచించారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. మహిళలు రూపాయి రూపాయి ఆదా చేసుకొని అభయహస్తం ద్వారా రూ. 1800 కోట్లు జమ చేస్తే.. ఆ డబ్బులు కూడా కేసీఆర్ ప్రభుత్వం మింగేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు రూ.3,500 కోట్ల మేర వడ్డీ రుణాలు ఎగొట్టిందని ఆరోపించారు. ఏడాదికి రూ.100 బతుకమ్మ చీర ఇచ్చి 100 సార్లు ప్రచారం చేసుకున్నారని, నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను అగౌరపరిచారని అన్నారు. ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే పాటలు రాయిస్తున్నారు. బతుకమ్మ పండుగను రాజకీయాలతో కలుషితం చేస్తున్న దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు అని ఫైర్ అయ్యారు.
బతుకమ్మ పాటలు కాకుండా బీఆర్ఎస్ పాటలతో బతుకమ్మలాడుతూ బతుకమ్మను అవమానిస్తున్న బీఆర్ఎస్‌కు మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అందరూ సంతోషంగా ఉంటే బీఆర్ఎస్‌కు నచ్చదన్నారు. వాళ్లకు అధికారం పోయింది కాబట్టి అన్ని అనర్ధాలే కనిపిస్తాయన్నారు. సొంత ఆడబిడ్డ కవిత ఫోన్లు టాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు.. తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరని సీతక్క చెప్పుకొచ్చారు.






