TG: రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచాలి

by Gantepaka Srikanth |

TG: రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచాలి

TG: రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇంచార్జ్ వీసీగా నియమితులైన డాక్టర్ రమేశ్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఇంచార్జ్ వీసీగా నియమితులైన డా.రమేశ్ రెడ్డి శుక్రవారం సంగారెడ్డిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంచార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన రమేశ్ రెడ్డిని మంత్రి అభినందించారు.

Next Story