- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్కొండ ఓటర్లను పచ్చి బూతులు తిట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరుడు (వీడియో)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రశాంత్ రెడ్డి సోదరుడు, బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలు డబ్బులను ఏ తరహాలో డిమాండ్ చేస్తున్నారో తెలిపేలా ఉన్న ఆ ఆడియోలో మంత్రి సోదరుడు ఓటర్లను పచ్చి బూతులు తిట్టారు.
ప్రజలు డబ్బులు పిండుతున్నారని, ఓట్లు కొనేందుకు రూ.18.5 కోట్లు ఖర్చు అయిందని ఆ ఆడియో ఉంది. ఈ సంభాషణ బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు ప్రజలను ఇంత చులకనగా మాట్లాడడం సరి కాదనే చర్చ బాల్కొండ సెగ్మెంట్‌లో జోరందుకుంది. వైరల్ అవుతున్న ఈ ఆడియో మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరుడిది అని కొందరు అంటుండగా.. కాదు మంత్రి అనుచరుల మధ్య జరిగిన సంభాషణ అని మరికొందరు అంటున్నారు. జిల్లాలో వైరల్‌గా మారిన ఈ ఆడియోలో మాట్లాడింది ఎవరనేది క్లారిటీ లేనప్పటికీ మంత్రి సోదరుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం.






