- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేడు మంత్రి పొన్నం పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. యూసుఫ్‌గుడా డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ, నవోదయ కాలనీ, మారుతీ నగర్, కమలాపురి కాలనీ, ఇంజనీర్స్ కాలనీల్లో రూ.1.78 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా లేబర్ అడ్డా రోడ్డులోని ఎల్.ఎన్ నగర్, యూసుఫ్‌గుడా బస్తీ, శ్రీకృష్ణ నగర్, హైలం కాలనీలో మొత్తం 14 పనులకు గాను 3.77 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని భరత్ నగర్ ఎక్స్ రోడ్డు, నేతాజీ నగర్, సుల్తాన్ నగర్, ప్రేమ్ నగర్, శంకర్ లాల్ నగర్, రాజీవ్ నగర్‌లో 11 పనులకు గాను రూ.2.94 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించనున్నారు.






