- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam: ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్ర: పొన్నం
జర్నలిస్టుల అరెస్టుపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్వేచ్ఛను హరించేలా వ్యక్తిగత అంశాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా కథనాలు రాసి రాక్షసానందం పొందుతామంటే అలాంటి వారి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఇవాళ కరీంనగర్‌లో శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో పొన్నం మాట్లాడారు. జర్నలిస్టుల అరెస్టుపై కొంత మంది మొసలి కన్నీరు కారుస్తున్నారని, మీ కుటుంబ సభ్యుల పట్ల ఇలాంటి అపవాదులు వేసి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి కథనాల పట్ల న్యూస్ పేపర్లు, చానళ్లు, సోషల్ మీడియా పట్ల ప్రభుత్వం చూస్తే ఊరుకోదన్నారు. ఈ కథనాల వెనుక ఎవరున్నా బాధ్యత వహించక తప్పదన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు, రుణాలు, ఇందిరమ్మ క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు కొనసాగిస్తున్నామని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని పథకాల అమలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిపోయిన కార్యక్రమాలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరంలో చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.






