- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్(Ramzan) నెల మార్చిలో మొదలవనుంది. అయితే రంజాన్ మాసంలో జరగనున్న ముస్లింల ప్రత్యేక ప్రార్థనల(Namaz) కోసం జరుగుతున్న ఏర్పాట్లపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుంచి ప్రారంభం అయ్యే రంజాన్ నెలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, వీధి దీపాలు, నీటి వసతి, నిరంతర కరెంటు సౌకర్యం.. ప్రార్థనలు చేసుకునేందుకు విశాల స్థలాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇక రంజాన్ నెలలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించింది రాష్ట్ర సర్కార్. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31వ తారీఖు వరకు సాయంత్రం 4 గంటలకే ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం నమాజ్, రోజాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అదేవిధంగా ముస్లిం ఉద్యోగులకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






