- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్‍కు (Vikas Raj) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మరణాల సంఖ్య నివారించడానికి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమం చేపడుతూ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్‍ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యగా రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో ప్రత్యేకంగా కేటాయించిన వేదికలపై ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని ఆదేశించారు. ఇది డ్రైవర్లకు, ప్రయాణికులకు యాక్సిడెంట్స్ స్పాట్ దగ్గర హెచ్చరికగా పనిచేస్తూ, రహదారి భద్రతపై అవగాహన కల్పించి, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను కాపాడటానికి, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అటువంటి డిస్‌ప్లేలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






