Ponnam: అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?.. బీఆర్ఎస్‍కు మంత్రి పొన్నం కౌంటర్

by Prasad Jukanti |

హుస్నాబాద్ విషయంలో మంత్రి పొన్నం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponnam: అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?.. బీఆర్ఎస్‍కు మంత్రి పొన్నం కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో జిల్లాల పునర్విభజన అంశం హాట్ హాట్‍గా మారింది. జిల్లాల పునర్విభజన పేరుతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న వేళ ఈ ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్‍పై (Secunderabad) బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ అస్తిత్వానికి ఎలాంటి భంగం కలగదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన.. 33 జిల్లాలు ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సికింద్రాబాద్‍ను ఎందుకు జిల్లా చేయలేదని ప్రశ్నించారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశాని విమర్శించిన మంత్రి ఏ నిర్ణయమైనా అందరి అభిప్రాయం మేరకే తీసుకుంటామన్నారు. హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు మీ పాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు.

Next Story