Minister Ponnam: విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రానున్న రోజుల్లో తెలంగాణ (Telangana) రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు.

Minister Ponnam: విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో తెలంగాణ (Telangana) రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ ఆయన వసంత పంచమి (Vasanth Panchami)ని పురస్కరించుకుని ఇవాళ వర్గల్ (Wargal) మండల కేంద్రంలోనీ శ్రీ విద్య సరస్వతి అమ్మ వారిని దర్శించకున్నారు. ఆయన వెంట గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి (Narsa Reddy) తదితురులు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ.. విద్యార్థులకు సౌకర్యవంతంగా, అత్యాధునికి హగులతో ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీ భర్తీకి నూతన నియామకాలు చేపడుతామని అన్నారు.

ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థి ఉన్నత చదువు చదివి రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశంలో కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగాలా వర్గల్ (Wargal) విద్యా సరస్వతి అమ్మ వారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అలా చేస్తేనే వారు ప్రయోజకులు అయి సమాజానికి మేలు చేస్తారని తెలిపారు. సంపాదించిన ఆస్తులు ఎనాడైనా పోవచ్చని.. గురువు నుంచి నేర్చుకున్న విద్యను ఎవరూ దొంగిలించ లేరని కామెంట్ చేశారు. తెలంగాణలో బాసర (Basara), వర్గల్ (Wargal) సరస్వతి అమ్మవారి ఆలయాలు మన ప్రాంతంలో ఉండటం అదృష్టమని అన్నారు. ప్రభుత్వం తరఫున దేవాలయాల అభివృద్ధికి తన సహకారం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకు దూరం చేయోద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Next Story