Minister Ponnam: మాకు ఎవరిపైనా కక్షసాధింపు లేదు.. మంత్రి పొన్నం మరోసారి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2024-10-28 07:33:19  IST  )

ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు ఎవరిపైనా కక్షసాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Minister Ponnam: మాకు ఎవరిపైనా కక్షసాధింపు లేదు.. మంత్రి పొన్నం మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు ఎవరిపైనా కక్షసాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ (Janwada Fram House) అంశంపై ఆయన మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఎవరైనా మద్యం పార్టీలో విదేశీ మద్యం వాడితే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ (Excise Department) నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ లేకుండా విందులు చేసుకుంటే బాగుంటదని హితువు పలికారు.

అయితే, అదే పార్టీకి హాజరైన విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు జన్వాడ ఫామ్‌హౌస్‌ (Janwada Faram House)లో జరుగుతున్న పార్టీపై రెయిడ్స్ చేశారని పేర్కొన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తమపై అకారణంగా తమ సర్కార్‌పై బురదజల్లేందుకు బీఆర్ఎస్ (BRS) ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Next Story