- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ సేఫ్టీ మాసంపై ఉన్నత స్థాయి సమావేశం.. పాల్గొననున్న మంత్రి పొన్నం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జనవరి నెలలో నిర్వహించనున్న ‘రోడ్ సేఫ్టీ మాసం’ (Road Safety Month) కార్యక్రమాలపై ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జనవరి నెలలో నిర్వహించనున్న ‘రోడ్ సేఫ్టీ మాసం’ (Road Safety Month) కార్యక్రమాలపై ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధ్యక్షతన నిర్వహించే ఈ భేటీలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, తదితరులు పాల్గొననున్నారు.
అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (JTC), డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (DTC) ఇతర రవాణా శాఖ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా జనవరి నెలలో చేపట్టాల్సిన రోడ్ సేఫ్టీ మాసం కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థలను భాగస్వాములను చేసేలా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, తదితర అంశాలపై దృష్టి సారించనున్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.






