- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC Strike: సమ్మె ఆలోచన విరమించుకోవాల్సిందే.. ఆర్టీసీ సంఘాలకు మంత్రి మరోసారి రిక్వెస్ట్
సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (RTC strike) సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం తదితరులు మంత్రిని కలిశారు. కార్మికుల సమస్యలను మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వారికి భరోసా ఇచ్చారు.
విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు: ఆర్టీసీ యాజమాన్యం
(TGSRTC) ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ తాజాగా ఆర్టీసీ యాజమాన్యం (RTC management) ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ పరిస్థితులను వివరించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడబోదని లేఖలో పేర్కొంది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైందని తెలిపింది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడిందని, బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కోల్పోయిందని గుర్తుకు చేసింది. కాగా, ఈ నెల 7న సమ్మెకు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మె సన్నద్ధతలో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు నిన్న కవాతు సైతం నిర్వహించింది.






